Tuesday, June 15, 2021

Telegna & Harayana festivals -బతుకమ్మ & బోనాలు

బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు

9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.

1. ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం.

clip_image001[4]

బతుకమ్మ సంబరాలు

తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

బోనాలు

బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్), లస్కర్ (సికింద్రాబాద్) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంబమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగాను నిర్వహిస్తారు ఆతరువాత చివరగా లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర చోట్ల నిర్వహిస్తారు ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు

బోనాల పండుగ కు గల శాస్త్రీయ కారణాలు

 

ఆషాఢ మాసంలో పండగ ఎందుకు చేస్తారు

మనకు ముఖ్యంగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలంలో మనకు కలరా,మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి .వానా కాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం.సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది.అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు

గుగ్గీలం లేదా మైసాచి పొగ

అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు.ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే.వానా కాలంలో దోమలు, ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి . అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు

లోహ్రి

ఉత్సహపూరితమైన రాష్ట్రాల్లో ముందుండే పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు, లోహ్రి అనే వ్యవసాయానికి సంబంధించిన పండుగను జరుపుకుంటాయి.

లోహ్రి అనే పదం ఉద్భవించడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఈ పదం ' లోహ్ ' అనే పదం తో ఉద్భవించిందని ఒక కథ ప్రచారంలో ఉంది. ' లోహ్ ' అంటే ఇనుము అని అర్ధం. మందమైన ఇనుము బాండీలను పండుగ సందర్భంగా రకరకాల మసాలాలు తయారుచేయడంలో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడి నుండే ఈ పండుగకు ఈ పేరు వచ్చిందని చెబుతారు. జానపద కథలు చెప్పేవారు మాత్రం పూర్వం ఇద్దరు తోబుట్టువులు ఉండేవారని వారి పేరు హోళికా మరియు లోహ్రి. హోళికా హోలీ సందర్భంగా వేసిన మంటల్లో చిక్కుకొని చనిపోయిందట, లోహ్రి బ్రతికిపోయాడట. ఆలా లోహ్రి బ్రతికిపోవడంతో ఆ ఆనందాన్నే ఇలా పండగ రూపంలో జరుపుకుంటున్నారని చెబుతారు.

లోహ్రి పంగడలో ముఖ్యమైన భాగం ఏమిటంటే, ఈ పండగ సందర్భంగా చిన్నపిల్లలు ఇంటింటికి వెళ్లి జానపద పాటలు పాడుతారు. వీరు ఇలా పాడుతున్నందుకు గాను, ఆ ఇంటివాళ్ళు బెల్లం, గింజలు, డబ్బు మరియు ఈ రోజుల్లో చాకోలెట్స్ ని వారికి బహుమతిగా ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లలకు ప్రోత్సాహకం లభిస్తుండటంతో వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలా చేయడం ద్వారా, వీరు వీరి యొక్క సంస్కృతి మరియు విలువల గురించి ఎంతగానో నేర్చుకుంటున్నారు. వీటి వల్ల వీరి వ్యక్తిత్వం కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. అందుచేతనే సంప్రదాయకమైన పంజాబీ కుటుంబాలన్నీ ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ని ఇస్తాయి.

వైశాఖి

వైశాఖి, లేదా బైశాఖి సిక్కులకు పెద్ద పండుగ. 1699 లో గురు గోబింద్ సింగ్ ఇదే రోజున ఖల్సా స్థాపించాడు. దానికి గుర్తుగా ఈ పండుగను జరుపు కుంటారు. హిందువులకు కూడా ఇది పండుగ దినమే. వైశాఖమాసంలో మొదటిరోజున ఈ పండుగ వస్తుంది. సూర్య మాన పంచాంగం ప్రకారం ఇది సంవత్సరంలో మొదటి రోజు. పంట ఇంటికి వచ్చే రోజుగా దీన్ని హిందువులు, సిక్కులు జరుపుకుంటారు. రోమన్ కాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా ఏప్రిల్ 13 / 14 తేదీలలో వస్తుంది.

వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు కనుక, పంజాబ్ మరియు హర్యానాల్లో ప్రముఖంగా చేసుకుంటారు. అత్యధిక శాతం సిక్కులు ఇప్పటికీ ఈ రాష్ట్రాలలోనే ఉన్నారు
సిక్కు మతంలోని వ్యవసాయదారులు రబి కాలం ముగియడాన్ని కొత్త సంవత్సరంగా భావించి, ఈ రోజున ఖల్సా పంత్ ఏర్పాటు చేస్తారు. పంజాబ్ మరియు హర్యానా రెండు రాష్ట్రాల్లో జరుపుకున్నప్పుటికిని, పంజాబ్ లో ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకుంటారు

No comments:

Post a Comment